Swayambhu: నిఖిల్ ‘స్వయంభూ’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:40 AM

నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైంది.

Swayambhu: నిఖిల్ ‘స్వయంభూ’ కొత్త షెడ్యూల్ ప్రారంభం
nikhil

నిఖిల్ (Nikhil) మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ (Swayambhu) మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైంది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు.

F3yRZwfWQAASM9R.jpeg

నిఖిల్ (Nikhil) హీరోగా 20వ చిత్రంగా పీరియాడికల్ జాన‌ర్‌లో రూపొందుతున్న‌ ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా ఉండేలా దర్శకుడు భరత్ కృష్ణమాచారి (Bharat) తెర‌కెక్కిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ 'స్వయంభూస చిత్రాన్ని అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నారు.


GQ--XWeaQAArj3B.png

ఈ సినిమాలో నిఖిల్ (Nikhil) లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తుండ‌గా ఆ పాత్ర కోసం ఆయ‌న ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకోవ‌డం విశేషం. సంయుక్త (Samyuktha), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్స్ గా నటిస్తుండ‌గా రవి బస్రూర్ సంగీతం, కెకె సెంథిల్ కుమార్ (KK Senthil Kumar ISC) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 01:28 PM