Niharika konidela: ఏనుగుల జంట.. ప్రేమలో ఉందా..ఆ ఫోస్ట్‌కి అర్థం ఏంటి?
ABN , Publish Date - Apr 09 , 2024 | 03:31 PM
విడాకుల అనంతరం మెగా డాటర్ నిహారిక కొణిదెల క్రియేటివ్ రంగంలో మరింత బిజీ అయింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ సిద్ధమవుతూనే మరోవైపు యాంకర్‌గానూ ఓ షో చేస్తుంది.
విడాకుల అనంతరం మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika konidela)క్రియేటివ్ రంగంలో మరింత బిజీ అయింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ సిద్ధమవుతూనే మరోవైపు యాంకర్‌గానూ ఓ షో చేస్తుంది. నిర్మాతగాను మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్న పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయినా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే! అందులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆల్రెడీ ప్రేమలో పడిందనే గాసిప్‌లు మొదలయ్యాయి. నిహారిక అవన్నీ విని ఊరుకుంది కానీ ఎలాంటి స్పందన లేదు (Marriage topic).
తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ ఫొటో మరోసారి ఆమె పెళ్లిపై చర్చకు దారి తీసింది. ఆ ఫొటోలో ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్‌స్ట్టాలో షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది. అది చూసిన వారంత నిహారిక మరోసారి ప్రేమలో పడిందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. మంగళవారం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడిచింది. అయితే నిహారికలో మళ్లీ ప్రేమలో పడలేదని, ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉందని సన్నిహితులు అంటున్నారు.