Allu Arjun - Netizens: లేడీ డాన్సర్‌కు ఒక న్యాయం.. కేశవకు ఒక న్యాయమా బన్నీ

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:04 AM

ఓ పెద్ద హీరో, ఆయనకు సంబంధించిన మేనేజర్లు ఆ అమ్మాయికి ఫోన్‌ చేసి, తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని భరోసా కలిగించడం మంచి విషయమే.

మాలీవుడ్‌లో జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) నెలరోజులుగా హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో పని వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా తమ సమస్యలను బయటపెడుతున్నారు.  ఈ విషయంలో ఇప్పటికే చాలామంది మలయాళ నటుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ (Jani Master) ఇష్యూ మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్‌ డాన్సర్‌ పోలీసులకు, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై అటు పోలీసులు, ఇటు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉన్న విమెన్‌ ప్రొటెక్టివ్‌ సెల్‌ విచారణ కొనసాగిస్తున్నాయి. ఓ పెద్ద హీరో, ఆయనకు సంబంధించిన మేనేజర్లు ఆ అమ్మాయికి ఫోన్‌ చేసి, తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని భరోసా కలిగించడం మంచి విషయమే. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అని ఇటీవల జరిగిన ఛాంబర్‌ ప్రెస్‌మీట్‌లో ఝాన్సీ అఫ్‌ ద రికార్డ్‌ చెప్పారు.  దాంతో అభిమానులు బన్ని మనసు గొప్పదంటూ సోషల్‌ మీడియలో పొగడ్తల పని పెట్టుకున్నారు. అయితే కొందరు మాత్రం ‘ఇదే మంచితనం జగదీష్‌(Jagadish) (పుష్పలో కేశవ (Kesava)పాత్రధారి) కేసు విషయంలో ఎందుకు చూపించలేదు’ అంటూ యాంటీ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.


'పుష్ష 2' షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జగదీష్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌లను ఆశ్రయించడంతో జగదీష్‌ని అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తరవాత బెయిల్‌ పై బయటకు వచ్చి, పుష్ష 2 షూటింగ్‌లో పాల్గొన్నాడు. అప్పట్లో జగదీష్‌ జైల్‌లో ఉంటే పుష్ష 2 షూటింగ్‌ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్ట్‌లు రీప్లేస్‌ చేయలేదు. అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్‌ని బయటకు తీసుకొచ్చారిన టాక్‌. ఆ తర్వాతే పుష్ప -2  కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైందని వార్తలొచ్చాయి. మరి జగదీష్‌ వల్ల నష్టపోయిన ఆ యువతి కుటుంబాన్ని  బన్నీ ఎందుకు అండగా నిలవలేకపోయాడు? జగదీష్‌తో మళ్లీ ఎందుకు నటించాల్సి వచ్చింది? జగదీష్‌ విషయంలో ఒక న్యాయం, జానీ మాస్టర్‌ విషయంలో ఒక న్యాయమా? (netizens Trolling) ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్‌ మీడియాలో యాంటీ ఫ్యాన్స్‌ విరుచుకుపడుతున్నారు. జగదీష్‌ (Jagadish) విషయంలోనూ బన్నీ కాస్త ఆలోచన చేసిన ఉంటే ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేవంటూ కామెంట్‌ చేస్తున్నారు. సమస్య వచ్చిన క్షణంలో ఏదో మంచి చేసేసినట్లు కాస్త ఎలివేషన్‌ ఇస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని బన్నీకి హితవు పలుకుతున్నారు నెటిజన్లు.

Updated Date - Sep 19 , 2024 | 12:04 PM