Nee dhare Nee Katha: ‘నీ దారే నీ కథ’ మంచి రోలర్‌కోస్టర్ ఫీల్ ఇస్తుంది
ABN , Publish Date - Jun 13 , 2024 | 06:06 PM
ప్రియతమ్, విజయ్ విక్రాంత్, అంజనా ప్రధాన పాత్రలతో రూపొందుతున్న చిత్రం నీ ధారే నీ కథ. వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ప్రియతమ్ (Priyatham Maanthini), విజయ్ విక్రాంత్ (Vijay Vikranth), అనంత్ (Ananth Padmasola), అంజనా (Anjana Balaji) ప్రధాన పాత్రలతో రూపొందుతున్న చిత్రం నీ ధారే నీ కథ (Needhare Nee Katha). వంశీ జొన్నలగడ్డ (Vamsi Jonnalagadda) దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాలోని ముఖ్య అంశాల గురించి మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వంశీ జొన్నలగడ్డ (Vamsi Jonnalagadda) మాట్లాడుతూ.. ఈ నీ ధారే నీ కథ (Needhare Nee Katha) చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీజర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. తాజాగా ప్రీమియర్ షో వేస్తే చూసినవారంతా సినిమా బాగుందని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
నీ ధారే నీ కథ (Needhare Nee Katha) సినిమా సంగీత ఆధారిత నేపథ్యంలో తెరకెక్కడమే కాక నేటి యువత, స్నేహం, కలలు ఇతివృత్తంలో తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని హైలెట్ చేస్తూ రూపొందించడం జరిగిందన్నారు. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవకుండా మంచి రోలర్‌కోస్టర్ లాంటి అనుభవాన్ని పొందుతారన్నారు. ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ పెద్ద ఎసెట్టుగా నిలుస్తుందని వంశీ జొన్నలగడ్డ (Vamsi Jonnalagadda) అన్నారు.