Sudheer Babu: 'సుధీర్ బాబు' హీరోగా.. పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:40 PM

ఇటీవ‌లే హ‌రోంహ‌ర చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు న‌వ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు. తాజాగా మ‌రోసారి భిన్న‌మైన సినిమానే చేయ‌నున్నాడు. పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నాడు.

Sudheer Babu: 'సుధీర్ బాబు' హీరోగా.. పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌
sudheer babu

ఇటీవ‌లే హ‌రోంహ‌ర చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకుని న‌వ ద‌ళ‌ప‌తిగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). అందులోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, గ్రిప్పింగ్ క‌థ‌నంకు ప్రేక్ష‌కుల నుంచి చాలా అద్భుత‌ స్పంద‌న వ‌చ్చింది. అయితే నిత్యం వైవిధ్య‌మైన చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఆయ‌న తాజాగా మ‌రోసారి భిన్న‌మైన సినిమానే చేయ‌నున్నాడు. పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నాడు. దీంతో ఇప్పుడు స‌ర్వ‌త్రా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో చ‌ర్చ బాగా న‌డుస్తోంది.

Sudheer Babu

భారీ బ‌డ్జెట్ రూపొంద‌నున్న ఈ సినిమా ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నుంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యాన‌త ఇస్తున్నారు. మ‌న పురాణాల‌లో నిక్షిప్త‌మై ఉన్న‌ ఎన్నో ర‌హ‌స్యాల నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన అనుభూతిని క‌లిగిస్తుందన్నారు. లోతైన క‌థ‌తో కుట్ర, ప‌న్నాగాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచి జ‌రిగే యుద్ధంగా ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెర‌కెక్క‌నుంది.


బాలీవుడ్‌లో రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో ప్రేర‌ణ అరోరా (Prerna Arora), శివిన్ నారంగ్ (Shivin Narang), నిఖిల్ నంద (Nikhi lNanda), ఉజ్వ‌ల్ ఆనంద్ (Ujjwal Anand) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. ఆగ‌స్ట్ 15న సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌నుండ‌గా సినిమాను వ‌చ్చే ఏడాది మార్చిలో శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నారు.

sb.jpg

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు (Sudheer Babu) మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’ అని అన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 02:40 PM