Narudi Brathuku Natana: నేషనల్ అవార్డు తెచ్చే సినిమా 

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:04 PM

శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర పాత్రధారులు. 

శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Brathuku Natana). శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర పాత్రధారులు. రిషికేశ్వర్ యోగి (Rishikeswara yogi) దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది    శనివారం  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక అతిథులుగా హాజరయ్యారు. 

సుధీర్ బాబు మాట్లాడుతూ " మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. నేను కృష్ణవంశీ చిత్రానికి, బాఘీ చిత్రాలకు ఆడిషన్స్ చేశాను. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది" అన్నారు. 

టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను" అని అన్నారు. 

దర్శకుడు  రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ " శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్" అని  అన్నారు.

 శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ "అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే.. నేషనల్ అవార్డు తెచ్చే సినిమా ఇది.  మొదట్లో చిన్న చిత్రంగా స్టార్ట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ రాకతో రూపురేఖలు మారిపోయాయి. అక్టోబర్ 25న మా సినిమాను చూడండి. మీతో పాటుగా నన్ను, నితిన్‌ను ఇంటికి తీసుకెళ్తారు’ అని అన్నారు. 

 Biggboss 8: పృథ్వీకి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన నాగార్జున


Updated Date - Oct 19 , 2024 | 09:35 PM