Nara Rohit: నారా రోహిత్‌ ట్వీట్‌ వైరల్‌..

ABN , Publish Date - Oct 13 , 2024 | 08:04 PM

నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్‌ సిరీ లెల్లతో (Actress Siri Lella) ఆయన వివాహం జరగనుంది.


నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్‌ సిరీ లెల్లతో (Actress Siri Lella) ఆయన వివాహం జరగనుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CBN), భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.  నారా రోహిత్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు షేర్‌ చేసి సిరి గురించి రాసుకొచ్చారు. మేమిద్దరం కలిసి నవ్వుతో నిండిన క్షణాలను, సాహసాలు, జ్ఞాపకాలను పంచుకున్నాము. ఇప్పుడు, నా లవ్‌ సిరితో ప్రేమ, ఆనందంతో నిండిన జీవితాన్ని నిర్మించడం కోసం, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘బాణం’ చిత్రంతో నారా రోహిత్‌ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘సోలో’తో చక్కని విజయం అందుకున్నారు.  అనంతరం ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాల్లో నటించారు. 2018 లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి సిరి తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. 

Updated Date - Oct 13 , 2024 | 08:05 PM