Nara Rohith: మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి పెదనాన్న..
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:34 PM
నారా రోహిత్ తన తండ్రి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తదుపరి తన పెదన్నాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆత్మీయులను ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టారు.
నారా రోహిత్ (Nara Rohith) తన తండ్రి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తదుపరి తన పెదన్నాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu naidu) నాయుడుతోపాటు ఆత్మీయులను ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ram murthy naidu) మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ రోహిత్ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో పెదనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు.
‘‘తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.