Nara Lokesh - Kalki: రీడిఫైన్‌ చేసే.. . మాస్టర్‌ పీస్‌!

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:42 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'కల్కి' ఫీవర్‌ నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కల్కి సినిమా గురించి సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.

Nara Lokesh - Kalki: రీడిఫైన్‌ చేసే.. . మాస్టర్‌ పీస్‌!


ప్రస్తుతం ఎక్కడ చూసిన 'కల్కి' ఫీవర్‌ నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కల్కి సినిమా గురించి సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.

'కల్కి’ సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్‌ వినడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభాస్‌, అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకోన్ అందరికీ కంగ్రాట్యులేషన్స్‌. అలాగే ఈ సినిమాని ఇండియన్‌ సినిమాని రీడిఫైన్‌ చేసే  సినిమాగా ఒక మాస్టర్‌ పీస్‌గా తెరకెక్కించినందుకు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాతగా అశ్వినీ దత్‌కి స్పెషల్‌ అప్రిషియేషన్‌ దక్కాలని పేర్కొన్నారు. స్వప్న, ప్రియాంక తెలుగు సినిమాకి సంబంధించిన కట్టుబాట్లను చెరిపేసి తెలుగు సినిమాని గ్లోబల్‌ లీగ్‌లోకి తీసుకెళ్ళేందుకు చాలా కృషి చేశారని నారా లోకేష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - Jun 27 , 2024 | 05:42 PM