Nani: హిట్‌-3 కోసం ఆ పని కూడా చేస్తున్నాడట!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:55 PM

గతేడాది ‘హాయ్‌ నాన్న’తో (Hi Nanna) ప్రేక్షకుల ముందుకొచ్చారు నాని(Nani). ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం’ పైనే ఆశలు పెట్టుకున్నారు.

గతేడాది ‘హాయ్‌ నాన్న’తో (Hi Nanna) ప్రేక్షకుల ముందుకొచ్చారు నాని(Nani). ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా అవుతోంది. ఆయన రైటర్‌గా మారినట్లు తెలుస్తోంది. ‘హిట్‌ 3’ (Hit 3)కోసం ఆయన కథ రాస్తున్నారని.. దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు శైలేశ్‌ కొలను స్ర్కిప్ట్‌ సిద్థం చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ‘హిట్‌’కు విశేష ఆదరణ లభించింది. ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. వీటికి కొనసాగింపుగా ‘హిట్‌ 3’ తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో నాని హీరోగా నటించనున్నారు. అర్జున్‌ సర్కార్‌గా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారని సమాచారం. శ్రద్థా శ్రీనాథ్‌ కథానాయికగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ (Saripodaa sanivaaram) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాని-వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత నాని, ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘హిట్‌ 3’ని కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.

Updated Date - Jul 26 , 2024 | 04:15 PM