Allu Arjun Remand: బన్నీ అరెస్ట్‌.. ప్రభుత్వానికి నాని సెటైర్‌

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:27 PM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ (Allu Arjun Arrest) చేసి రిమాండ్‌కు పంపడంపై హీరో నాని (Nani Reaction) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ (Allu Arjun Arrest) చేసి రిమాండ్‌కు పంపడంపై హీరో నాని (Nani Reaction) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. సంధ్య థియేటర్‌ ఘటన నిజంగా దురదృష్టకరం. మనం ఇలాంటి ఘటన నుంచి నేర్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యల చేపట్టాలి. ఇది మనందరి తప్పు. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. (Allu Arjun Remand)



సంధ్య థియేటర్‌(Sandhya Theatre) , రేవతి కేసులో (Ravati Case) అరెస్ట్‌ అయిన అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన్ను చంచలగూడ జైలుకి తరలించారు. ఈ నెల 27 వరకూ రిమాండ్‌ జరగనుంది.

Updated Date - Dec 13 , 2024 | 09:02 PM