Kalki 2898 AD: కల్కి కోసం మరో ఇద్దరు హీరోలు!
ABN , Publish Date - Apr 22 , 2024 | 08:24 PM
ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ప్రభాస్(Prabhas) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ’ (kalki 2898 AD). వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ (Nag ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం పలువురు అగ్రతారల నటిస్తున్న విషయం తెలిసిందే! మరో ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో భాగం కానున్నారని తెలుస్తోంది. నాని, విజయ్ దేవరకొండ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటి అన్నాబెన్ కూడా ‘కల్కి’లో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పడుకొణె (Deepika padukone)నటిస్తోంది.
అంతే కాదు ఇందులో దుల్కర్ సల్మాన నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో దుల్కర్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేనిప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ‘కల్కి’ సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే డిజైన్ చేయగలడు’ అని అన్నారు. పాత్రలకు తగ్గట్టు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ.. తమిళంలో కమల్‌హాసన్.. హిందీలో అమితాబ్, దిశాపఠాని.. కేరళలో అన్నాబెన్, దుల్కర్‌లు సినిమా ప్రత్యేకతలు దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తారని అందుకే దర్శకుడు ఇలా ఎంపిక చేశారని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మహాభారతం తో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతను ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు సృష్టించారు నాగ్ అశ్విన్