Hero Nani: 'ఈగ - 2’ ఎప్పుడంటే  నీతో అవసరం లేదన్నారు

ABN , Publish Date - Aug 27 , 2024 | 02:45 PM

'ఈగ' (Eega)చిత్రం సీక్వెల్‌ గురించి హీరో నాని (nani)మాట్లాడారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)ఈ నెల 29న విడుదలకు సిద్దంగా ఉంది.

'ఈగ' (Eega)చిత్రం సీక్వెల్‌ గురించి హీరో నాని (nani)మాట్లాడారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)ఈ నెల 29న విడుదలకు సిద్దంగా ఉంది. వివేక్‌ అత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాని వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి, తనకు మధ్య జరిగిన ఓ సంభాషణ గురించి నాని చెప్పుకొచ్చారు.

‘నేను విజయేంద్ర ప్రసాద్‌గారిని ఎప్పుడు ‘ఈగ’ సీక్వెల్‌ (Eega Sequel) గురించి అడగలేదు. కానీ, రాజమౌళితో దీని గురించి సరదాగా మాట్లాడాను. ‘ఈగ 2’ చేసానన్నారు కదా.. ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన.. ‘‘మేము ఈగ 2’ చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది’’ అని చెప్పారు. ‘ఈగ’ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయనకు దీని సీక్వెల్‌ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు’’ అని అన్నారు. నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఈగ’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది.విజువల్‌ వండర్‌గా ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. 2012లో విడుదలైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకొంది.  

దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం..

ఇదే వేదికపై మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, హేమ కమిటీ నివేదిక గురించి నాని  మరోసారి స్పందించారు. ‘‘హేమ కమిటీ నివేదిక చూసి షాకయ్యాను. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నామనిపిస్తోంది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. గతంలో జరిగిన నిర్భయ ఘటన బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఫోన్‌ను స్క్రోల్‌ చేయడానికి కూడా భయపడుతున్నా. సోషల్ మీడియా మితిమీరిన వాడకం ఎప్పటికైనా ప్రమాదమే. మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి విన్నప్పుడల్లా వాటి నుంచి బయటకు రాలేకపోతున్నా. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. అప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి’’ అని చెప్పారు.

Updated Date - Aug 27 , 2024 | 05:22 PM