Nani : వర్కవుట్‌ అవుతుందా?

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:56 PM

నాని(Nani),  శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) కలయికలో ‘దసరా’ సినిమా వచ్చింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. నాని

నాని(Nani),  శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) కలయికలో ‘దసరా’ సినిమా వచ్చింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. నాని నటించబోతున్న 33వ(Nani 33) సినిమా ఇది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ.80 నుంచి రూ.100 కోట్ల బడ్జెట్‌ అవ్వబోతోందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అదే కనుక నిజమైతే నాని కెరీర్‌లో ఇదే భారీ సినిమా అవుతుంది. ‘దసరా’కు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సినిమా ఆ మొత్తాన్ని రాబట్టగలిగింది. ఆ ధైౖర్యంతోనే ఇప్పుడు రూ.100 కోట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారని టాక్‌. సినిమా సినిమాకు నాని మార్కెట్‌ కూడా పెరుగుతోంది. ‘అష్టాచమ్మ’ రెండు కోట్ల బడ్జెట్‌తో తీశారు. ‘భలే భలే మగాడివోయ్‌’ సాధించిన కమర్షియల్‌ సక్సెస్‌తో హీరోగా తన రేంజ్‌ పెరిగింది. ఆ తరవాత ప్రతీ సినిమాకూ బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది. పారితోషికం కూడా బాగానే పెంచాడని టాక్‌. ఇప్పుడు సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్యలో ఉందని సమాచారం.

నాని సినిమా అంటే  ఓటీటీ, శాటిలైట్‌ నుంచి మంచి ఆఫర్లే వస్తాయి. అందుకే నిర్మాతలు కూడా నానిపై రిస్క్‌ చేయడానికి సిద్థం అవుతున్నారు. నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ని బట్టి  నాని- శ్రీకాంత్‌ ఓదెల సినిమాపై ఎఫెక్ట్‌ చూపిస్తుంది. ‘సరిపోదా శనివారం’ బాగా ఆడితే.. నిర్మాత రూ.100 కోట్లు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించకపోవొచ్చు. లేదంటే రూ.80 కోట్లలోపే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో నానికీ జోడీగా జాన్వీకపూర్‌ పేరు పరిశీలనలో ఉంది. జాన్వీ పారితోషికం ఇప్పుడు రూ.3-4 కోట్ల దగ్గర్లో ఉంది. హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ దగ్గరదగ్గర 30 కోట్లు అవుతుంది.

Updated Date - Jul 21 , 2024 | 12:56 PM