Nandini Reddy: పెద్ద ఓటీటీ కోసం.. లేడీ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:10 PM

నందినీరెడ్డి (Nandini Reddy) టాలీవుడ్‌ మహిళా దర్శకుల్లో గట్స్‌ ఉన్న డైరెక్టర్.  ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ లాంటి మంచి హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అన్నీ మంచి శకునములే’ తరవాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు.

నందినీరెడ్డి (Nandini Reddy) టాలీవుడ్‌ మహిళా దర్శకుల్లో గట్స్‌ ఉన్న డైరెక్టర్.  ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ లాంటి మంచి హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అన్నీ మంచి శకునములే’ తరవాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా అనుకొన్నారు కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నెట్‌ ఫిక్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఓ లేడీ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్ ను  (Lady oriented story) నందిని తయారు చేశారని, అది నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix) చేతికి వెళ్లిందని, అగ్ర కథానాయిక ఈ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సమంతతో (Samantha) నందినికి మంచి అనుబంధం ఉంది. ‘ఓ బేబీ’ వీరి కాంబోలో వచ్చిన హిట్టు సినిమా. నందినీరెడ్డి ప్రణాళిక పర్ఫెక్ట్‌గా ఉంటే ఆ ప్రాజెక్ట్‌కు సమంతనే సై అనొచ్చు. సమంత లాంటి స్టార్‌ దొరికితే నందిని ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తారు. లేదంటే.. షో రన్నర్‌గా వ్యవహరిస్తారని కూడా టాక్‌ నడుస్తోంది. మరోవైపు సినిమాకు తగిన ప్రయత్నాలు కూడా నందిని జోరుగా సాగిస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థల కోసం ఆమె కథలు సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలోనే వెబ్‌ సిరీస్‌కు గురించి అధికారిక ప్రకటన రానుందన తెలుస్తోంది.

Updated Date - Jul 19 , 2024 | 03:19 PM