Nandamuri Mokshagna: మోక్ష‌జ్ఞ రెండో సినిమా ఫిక్స్.. హిట్ డైరెక్టర్

ABN , Publish Date - Dec 02 , 2024 | 05:36 PM

ఎవరు ఊహించని స్టైల్‌లో నందమూరి నట వారసుడు నందమూరి మోక్ష‌జ్ఞ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ లక్కీ డైరెక్టర్‌తో తన రెండో సినిమాని సైన్ చేశాడు.

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్ష‌జ్ఞ లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సెలెక్షన్ తో అదరగొడుతున్నాడు. తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఎంచుకున్న ఆయన రెండో సినిమా కోసం కూడా ఓ మంచి ప్లాన్ వేశాడు. ఇంకా మొదటి సినిమా షూటే స్టార్ట్ కాలేదు, అప్పుడే సెకండ్ మూవీ ఏంటి అనుకుంటున్నారా. అవును మరి ఆయన ఓకే కూడా చేసేశాడు. అది కూడా ఇప్పుడు సూపర్ హిట్ తో టాలీవుడ్ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్‌తో. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..


ఈ దీపావళికి రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి మ్యాజికల్ హిట్ సాధించారు. ఈ సినిమాతో లక్కీ భాస్కర్‌కి ముందొక వెంకీ అట్లూరి, తర్వాత ఇంకో వెంకీ అట్లూరి అనే ఇమేజిని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టెన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే. మరోసారి వెంకీ అట్లూరితో నాగవంశీ జతకట్టి మోక్ష‌జ్ఞ సెకండ్ ఫిల్మ్ రూపొందించడానికి డీల్ కుదిరించేసుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు మోక్ష‌జ్ఞ సెలక్షన్ తో తెగ ఖుషి అయిపోతున్నారు.

Vaathi-Sir-Movie-Producer-Naga-Vamsi-S-Director-Venky-Atluri.jpg


ఇక ప్రశాంత్ వర్మ సినిమా డిసెంబర్ 5 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో, వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. నందమూరి అభిమానులను మరియు సాధారణ సినీ ఔత్సాహికులను ఆకర్షించడానికిను కథానాయకుడిగా పరిచయం చేయడానికి బాలకృష్ణ కుటుంబం చాలాకాలంగా సరైన ప్రాజెక్ట్, దర్శకుడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ సామర్థ్యాన్ని గుర్తించి మోక్షజ్ఞ ఎంట్రీకి అత‌నే సరైన ద‌ర్శ‌కుడిగా బాల‌కృష్ణ భావించి మోక్ష‌జ్ఞ‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ చేతిలో పెట్టాడు.

Updated Date - Dec 02 , 2024 | 05:38 PM