NKR21: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా క్లైమాక్స్‌.. రూ 8 కోట్లు, వెయ్యి మంది

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:37 PM

డెవిల్ చిత్రం త‌ర్వాత‌ నందమూరి కళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న నూత‌న చిత్రం #NKR21 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం నెట్టింట బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది.

NKR21

డెవిల్ చిత్రం త‌ర్వాత‌ నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) న‌టిస్తోన్న నూత‌న చిత్రం #NKR21 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ (Ashoka Creations), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా (Ashoka Muppa), సునీల్ బలుసు (sunil balusu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల‌ ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్’ పేరుతో ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

NKR21

తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం నెట్టింట బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోండ‌గా క్లైమాక్స్ పార్ట్‌ చిత్రీక‌ర‌ణ ముగిసింది. ఆర్ట్ డైరెక్ట‌ర్‌ బ్ర‌హ్మ క‌డ‌లి సార‌థ్యంలో రూ.8 కోట్లకు పైగా ఖ‌ర్చుతో నిర్మించిన సెట్‌లో వెయ్యి మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొన‌గా హైద‌రాడాద్‌లో ఫైట్ మాస్ట‌ర్‌ రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో గ‌త నెల రోజులుగా జ‌రుగుతున్న‌ ప‌తాక పోరాట స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.


NKR21.jpg

ఇదిలాఉండ‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ చిత్రం అనంత‌రం కాస్త గ్యాప్ త‌ర్వాత విజయశాంతి (Vijayashanthi) ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు సోహెల్ ఖాన్ ఈ సినిమాతో తెలుగు, సౌత్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు.

Nkr.jpg

సాయి మంజ్రేకర్ (Saiee M Manjrekar) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రామ్ ప్రసాద్ డీవోపీ‌గా, అజనీష్ లోక్‌నాథ్ (AJANEESH LOKNATH ) సంగీతం అందిస్తుండ‌గా, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 03:37 PM