Nandamuri Balakrishna: 'ఆదిత్య 369' సీక్వెల్ రెడీ.. మోక్షజ్ఞ
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:32 PM
బాలకృష్ణ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ సిద్ధమైంది. హీరో ఎవరంటే..
నందమూరి అభిమానులకి బాలకృష్ణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ సిద్ధమయినట్లు తెలిపారు. 1991లో రిలీజైన ప్రయోగాత్మక 'ఆదిత్య 369' సంచలన విజయం సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సీక్వెల్ ని రూపొందించనున్నారట. ఇంతకీ సినిమా పేరేంటి? హీరోగా బాలకృష్ణనే నటిస్తారా అంటే..
తాజాగా జరిగిన ఆన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఆదిత్య 369కు సీక్వెల్ 'ఆదిత్య 999' రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అన్ని కుదిరితే 2025లో సినిమా రిలీజ్ అవుతందన్నారు.' దీనికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. 'ఆదిత్య 369' సంబంధించిన గెటప్‌లో బాలయ్య స్టేజ్ పై కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.
నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సెలెక్షన్ తో అదరగొడుతున్నాడు. తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఎంచుకున్న ఆయన రెండో సినిమా కోసం కూడా ఓ మంచి ప్లాన్ వేశాడు. రీసెంట్ గా 'లక్కీ భాస్కర్'తో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరితో నాగవంశీ జతకట్టి మోక్షజ్ఞ సెకండ్ ఫిల్మ్ రూపొందించడానికి డీల్ కుదిరించేసుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సెలక్షన్ తో తెగ ఖుషి అయిపోతున్నారు.