Nandamuri Balakrishna: సినిమా రికార్డులు.. సృష్టించాలన్నా,తిరగరాయాలన్నా నేనే
ABN , Publish Date - Mar 29 , 2024 | 06:15 AM
లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన లెజెండ్ (Legend)వారి సెకండ్ కొలాబరేషన్ లో 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ #10YearsForLegend వేడుకలని ఘనంగా నిర్వహించారు.
లెజెండ్ #Legend బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ #NandamuriBalakrishna మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వంద రోజుల పండగ జరుపుకుంటాం. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత ఉందో కళ్ళముందు కనిపిస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం.
సమరసింహా రెడ్డి 30 కేంద్రాలలో సిల్వర్ జుబ్లీ చేసుకొని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో వందరోజులు ఆడిన సినిమా నరసింహ నాయుడు. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్. అలాగే నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులుని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్.
సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను. సినిమా అంటే సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథలు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. లెజెండ్ లో మహిళలు ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఉంది. ఇటివలే వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిలో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం. కళామ్మ తల్లి, నా తల్లితండ్రుల, అభిమానుల ఆశీస్సులు వుండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుతున్నానని భావిస్తున్నాను.
చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా లెజండ్. సింహ, లెజెండ్, అఖండ, నేలకొండ భగవంత్ కేసరి...ఈ చిత్రాలన్నీ తృప్తిని ఇవ్వడంతో పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసి పెంచాయి. 2014 ఎలక్షన్స్ కి ముందు లెజెండ్ విడుదలైయింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత వుందో మనకి తెలుసు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సినిమా మళ్ళీ విడుదల కాబోతుంది. సినిమా ఎంత ప్రభావం వుంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు. జయం మనదే.
దర్శకుడు బోయపాటి #BoyapatiSreenu గారు, నేను ఒక సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి అలోచించము. రేపు జరబోయే సినిమా గురించి కూడా మాట్లాడుకోం. మేము మాటల మనుషులం కాదు. చేసి చూపిస్తాం. మా ఆలోచనలు ఒకటే. రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ ఆణిముత్యాలు లాంటి పాటలు సమకూర్చారు. సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పని చేశారు. సోనాల్ చౌహాన్ అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే రాధిక ఆప్టే గారు కూడా చక్కని అభినయం కనబరిచారు. జగపతి బాబు గారు తన పాత్రలో చాలా అద్భుతంగా రాణించారు. మిగతానటీనటులంతా వారి పాత్రలలో ఒదిగిపోయారు.
లెజెండ్ #Legend మళ్ళీ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి తరమే కాదు నా మనవడి తరంకు కూడా నేను కనెక్ట్ అయినందుకు, నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కళామాతల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా.. ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాని నాతో పాటు నా సినిమాలని విజయం చేస్తున్న అభిమానులకు , ప్రేక్షకులు, ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. లెజెండ్ ని అప్పుడు అంత విజయం చేసినందుకు, రేపు చేయబోతునందుకు అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ తెలిపారు.