Nagarjuna: మోదీకి నాగార్జున కృతజ్ఞతలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 09:44 AM

భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు (ANR) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) కొనియాడడం నాగార్జున (Nagarjuna) స్పందించారు.

భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు (ANR) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) కొనియాడడం నాగార్జున (Nagarjuna) స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి’’ అని నాగార్జున పేర్కొన్నారు. పతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని పలు విషయాలు పంచుకుంటారనే సంగతి తెలిసిందే! (Mann ki baat)

తాజా ఎపిసోడ్‌లో ఏఎన్నార్‌, బాలీవుడ్‌ దర్శకుడు తపన్‌ సిన్హా, రాజ్‌కపూర్‌ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని వారిని గురించి మోదీ  కొనియాడారు. అక్కినేని.. తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చాలా చక్కగా చూపించేవారని అన్నారు. తపన్‌ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు చేశాయని, రాజ్‌ కపూర్‌ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోదీ అన్నారు. తొలిసారిగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమావేశాలను వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించబోతున్నామని ప్రధాని తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 11:08 AM