Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:49 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)వేసిన పిటిషన్‎పై నాంపల్లి కోర్టు విచారణలో భాగంగా ఆయన నేడు కోర్టు‌కి హాజరయ్యారు.

Nagarjuna at nampally court

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)వేసిన పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని మంగళవారం నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. దీంతో కోర్ట్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. దీంతో నాగార్జున ఈరోజు కోర్ట్‎కు హాజరయ్యారు.

అనంతరం కోర్టు నాగార్జున వాంగ్మూలం కోరింది. దీంతో ఆయన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ద్వారా తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలియజేశారు. కేవలం పొలిటికల్ మైలేజి కోసమే ఆమె ఈ వ్యాఖ్యలను చేశారని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కోర్టు ఆయన వాదనలను రికార్డ్ చేసింది. 


తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. తాజాగా హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా వార్తల కోసం

Updated Date - Oct 08 , 2024 | 05:12 PM