Nagarjuna; బిగ్‌బాస్‌ సీజన్  8 ముస్తాబవుతోంది!

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:17 PM

తెలుగు టీవీ ఆడియన్స్ కు  ఫేవరెట్‌ రియల్టీ షో బిగ్‌బాస్‌ సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు సంబంధించిన తొలి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సీజన్‌ లోగో విడుదలైంది.

తెలుగు టీవీ ఆడియన్స్ కు  ఫేవరెట్‌ రియల్టీ షో బిగ్‌బాస్‌ సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు సంబంధించిన తొలి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సీజన్‌ లోగో విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాగార్జున 8వ సీజన్ కు  కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్థం కండి’ అని పేర్కొన్నారు. అయితే తాజా సీజన్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది. ఇంటి సభ్యులుగా ఎవరెవరు పాల్గొనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 21 , 2024 | 03:27 PM