Nagababu Konidela: ఇండస్ట్రీ  ఎవడబ్బ సొత్తు కాదు..

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:53 AM

''సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదే కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ

''సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు,
మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు..
మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదే కాదు..
కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ’’
అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు మెగాబ్రదర్‌ నాగబాబు(Nagababu). సోమవారం
రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీపై కామెంట్స్‌ (Comments on Mega family) చేసే ఆకతాయిలకు ఈ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ ''ఈ మధ్యకాలంలో చాలామంది మెగాఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, వీళ్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు' (Nagababu Fire on Trollers) అంటూ పనికిమాలిన కామెంట్లు చేసే వెధవల్ని చాలామందిని  చూశా. మాకు అలాంటి ఫీలింగ్‌ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదే కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ. ఇది అందరిదీ. ఎలాంటి నేపథ్యంలో లేకుండా వచ్చిన అడివి శేష్‌ తన కషంతో  ఎదిగాడు. ప్రస్తుతం 'కమిటీ కుర్రాళ్లు' చిత్రంలో నటించిన ఆర్టిస్ట్‌లు ఎవరు ఏస్థాయికి వెళ్తారో ఎవరు ఊహించలేం. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. నిరూపించుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయి. మంచి కథ ఎంచుకుని, నిబద్ధతతో పని చేసిన వారికి విజయం తప్పనిసరి. కొడితే ఎగిరి ఎక్కడో పడే కంటెంట్‌ కాకుండా యంగ్‌స్టర్స్‌ అంతా మంచి కథల మీదే ఫోకస్‌ పెట్టంది. అలా కథల ఎంపికలో అడివి శేష్‌, వరుణ్‌తేజ్‌ నచ్చుతారు. 'విరూపాక్ష' నుంచి మా సాయి తేజ్‌ కూడా నచ్చుతున్నాడు’’ అని అన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 11:53 AM