Naga Chaitanya: ఇద్దరు పిల్లలు చాలు.. వాళ్లతో ఎలా ఉండాలంటే..
ABN , Publish Date - Dec 07 , 2024 | 10:52 PM
కొత్తగా పెళ్లైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొన్నారు. తన కుటుంబ, సినీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కొత్తగా పెళ్లైన నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో (Rana Talk show) పాల్గొన్నారు. తన కుటుంబ, సినీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని, చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలన్నీ వాళ్లతో తిరిగి పొందాలని చైతన్య అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే విజయం సాధించినట్లే. మామూలుగా ఒక సినిమా చేస్తాం. అది బాగా ఆడుతుంది. కలెక్షన్లు కూడా బాగా వస్తాయి. చాలా రోజులు ఆడుతుంది. నా దృష్టిలో అది నిజమైన విజయం కాదు. మన తెలివితో ఒక స్ర్కిప్ట్ ఎంచుకొంటాం. మన నిర్ణయాన్ని నిజం చేస్తూ ఆ సినిమా విజయం సాధిస్తే అదీ అసలైన విజయం. కుటుంబమే నా లైఫ్.. అది లేకుండా నా జీవితాన్ని చూసుకోలేను’’ అని అన్నారు.
‘‘నాకు 50 ఏళ్లు వయసు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నా. మధ్యలో రానా అందుకొని వెంకీమామలా ముగ్గురు, నలుగురు కావాలా అని అడిగారు. అందుకు చైతన్య ుూనాకు ఒకరిద్దరు చాలు. వెంకీమామది పెద్ద కుటుంబం. నాకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్‌కు తీసుకెళ్తా. కూతురు పుడితే, తనకు ఎలాంటి హాబీలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రోత్సహిస్తా. నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలనుంది. మనం చిన్నప్పుడు పిల్లలుగా కొన్ని క్షణాలు ఎంజాయ్ చేశాం. ఆ క్షణాలను వాళ్లతో కలిసి మళ్లీ ఆస్వాదించాలనుంది’’ అని అన్నారు.