Nag Ashwin: అమెరికన్  ఆడియన్స్ కు  కృతజ్ఞతలు!

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:26 PM

"కల్కి’(Kalki 2898 AD) లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని బిగ్‌ స్క్రీన్ పై  చూస్తే వచ్చే ఆనందం ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు దీన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారు’’ అని నాగ్‌ అశ్విన్ అన్నారు.

Nag Ashwin: అమెరికన్  ఆడియన్స్ కు  కృతజ్ఞతలు!

"కల్కి’(Kalki 2898 AD) లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని బిగ్‌ స్క్రీన్ పై  చూస్తే వచ్చే ఆనందం ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు దీన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారు’’ అని నాగ్‌ అశ్విన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్‌ సొంతం చేసుకుంటోంది. తాజాగా అమెరికన్‌ ఆడియన్స్‌కు దర్శకుడు కృతజ్ఞతలు   చెప్పారు. సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. (Nag Ashwin thnaks to American Audience)


‘మా నుంచి వచ్చే ప్రతి సినిమాకు అమెరికన్‌ ఆడియన్స్‌ చాలా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మంచి సినిమాకు అండగా ఉంటారు. అందరికంటే ముందుగా ‘కల్కి’ని ఆదరించారు. మీ చిత్రంగా భావించి సపోర్ట్‌ చేశారు. మీ స్నేహితులను, బంధువులను కూడా కల్కికి తీసుకెళ్లండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని   బిగ్‌ స్క్రీన్ పై  చూస్తే వచ్చే ఆనందం ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు దీన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారు’ అని నాగ్‌ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు.

విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ‘కల్కి’.. వారాంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.  ఈ రోజు 555 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మరెన్నో రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ బుకింగ్స్‌  సేల్స్‌లోనే ఓవర్సీస్‌లో రికార్డులు సొంతం చేసుకుంది కల్కి. తాజాగా వసూళ్ల విషయంలో అక్కడ మరో ఘనత సాధించింది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు 11 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మొదటి వారంలోనే ఈ మార్క్‌ను చేరుకోవడం విశేషమని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ భారతీయ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రాలేదని చిత్ర బృందం తెలిపింది.



Updated Date - Jul 01 , 2024 | 02:27 PM