Nag Ashwin - Kalki: ప్రతిభ, అంకితభావం వల్లే సాధ్యమైంది

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:01 PM

ప్రభాస్‌ (Prabhas)హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin)  దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898Ad) ట్రైలర్‌ ఇటీవల విడుదలై విశేషమైన స్పందన దక్కించుకుంది. లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

Nag Ashwin - Kalki: ప్రతిభ, అంకితభావం వల్లే సాధ్యమైంది

ప్రభాస్‌ (Prabhas)హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin)  దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898Ad) ట్రైలర్‌ ఇటీవల విడుదలై విశేషమైన స్పందన దక్కించుకుంది. లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ "ట్రైలర్‌ విడుదల తర్వాత నా మనసు భావోద్వేగానికి గురవుతుంది. పురాణాలు, సైన్స్‌ రెండింటిపై నాకు ఆసక్తి ఎక్కువ. ఈ రెండింటిని కలిపి సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల క్రితం అనుకున్నాను. మా ఆర్టిస్టులందరి సాయంతో మైథాలజీకి సైన్స్‌ను జోడించి ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కించాను. టీమ్‌ అద్భుతమైన ప్రతిభ అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. నా కలను సాకారం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి పని చేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటు. దేశంలోని వారంతా దీన్ని చూసి గర్వపడతారు’ అని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. (Trending views)


తాజాగా విడుదలైన ‘కల్కి’ ట్రెలర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హిందీ భాషలో 24 గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలోనే ట్రైలర్‌ 2ను విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారమవుతోంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో రెండు ట్రైలర్లు  కట్‌ చేశారని.. త్వరలోనే రెండో దాన్ని రిలీజ్‌ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఫస్ట్‌ సింగిల్‌ కూడా త్వరలో రానుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోన నటిస్తుండగా దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Jun 12 , 2024 | 05:40 PM