Nag Ashwin: భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందంటే..!
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:03 PM
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ (kalki 2989 ad) చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొన్నారు
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ (kalki 2989 ad) చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొన్నారు. అక్కడ 'కల్కి' గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
"మహాభారతం’, స్టార్ వార్స్... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.’ అని తెలిపారు.
ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుండగా కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత నిర్మిస్తున్నారు. తాజాగా ‘జస్ట్ ది వార్మ్ అప్’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది.