Kalki 2898 AD: విమర్శలపై నాగ్‌ అశ్విన్ స్పందన!

ABN , Publish Date - Jul 09 , 2024 | 07:03 PM

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నిడివి  3.01 గంటలు ఉన్న విషయం తెలిసిందే.


నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నిడివి  3.01 గంటలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు దీని నిడివి విషయంలో కొందరు విమర్శించారు. తాజాగా వీటిపై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. తనకు ఎంత టైమ్‌ ఉన్నా ఎడిట్‌ చేసేందుకు సరిపోదన్నారు. ‘సినిమా కోసం పడిన కష్టమంతా దాని ఫలితం చూశాక మర్చిపోయాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఆదరణ చూస్తుంటే ఆనందంతో పాటు భావోద్వేగంగా ఉంది. చిన్నచిన్న ప్రాంతాల్లోనూ మంచి విజయం సాధించింది. ఇలాంటి సినిమాల కోసం నాకు మరో నెల సమయం ఇచ్చినా సరిపోదు. ఇంకాస్త సమయం ఉంటే బాగుండునని భావిస్తాను. కొందరు దీని రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి. ‘ఇది మొదటి భాగం. ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అంత రన్‌టైమ్‌ వచ్చింది. కొందరు దీన్ని ‘మహానటి’తో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, కల్కికి చాలా తేడా ఉంది. రెండూ భిన్నమైన కథలు. అది కేవలం ఒక మహిళకు చెందిన కథ, ఆమె పాత్ర మాత్రమే ప్రధానమైనది. కానీ ఇందులో చాలామంది అగ్రతారలు ఉన్నారు. వాళ్ల పాత్రలన్నీ కీలకమైనవే. వాళ్ల పాత్ర చుట్టూ కథ అల్లుకుపోవాలి’ అని చెప్పారు. 

Updated Date - Jul 09 , 2024 | 07:03 PM