రవితేజ వారసుడి ‘Mr. ఇడియట్’.. మంగ్లీ పాట వదిలిన తమన్
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:24 PM
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. తాజాగా ఈ సినిమాలోని కావాలయ్యా అంటూ సాగే పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
మాస్ మహరాజ్ రవితేజ (Ravi Teja) తమ్ముడు రఘు కొడుకు మాధవ్ (Madhav) హీరోగా నటిస్తోన్న సినిమా మిస్టర్ ఇడియట్ (Mr. Idiot). సిమ్రాన్ శర్మ (Simran Sharma) హీరోయిన్గా నటిస్తోండగా జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. శ్రీలీల ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న గౌరీ రోణంకి (Gowri Ronanki) ఈ మూవీకి దర్శకత్వం వహించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని కావాలయ్యా (Kavalayya) అంటూ సాగే పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ 'కావాలయ్యా..' సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ చాలా బాగుందని చెపప్డంతో పాటు హీరో మాధవ్, మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ అందించారు.
ఈ 'కావాలయ్యా.. (Kavalayya) పాటను అనూప్ రూబెన్స్ (Anup Rubens) మంచి బీట్ తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. గాయని మంగ్లీ (Mangli) పాడింది. 'కళ్లల్లోకి కళ్లు పెట్టి అదోలా చూశావయ్యా, మాటల్తోనే మనసుకు మందే పెట్టావయ్యా, తస్సాదియ్యా, తస్సాదియ్యా, పచ్చి పచ్చిగ చెప్పాలంటే పిచ్చిగ ఫిదా అయ్యా, పూవుల్తోటి పొట్లం గట్టి మేరె దిల్ దియా, చూస్కోవయ్యా, తీస్కోవయ్యా, కావాలయ్యా, నువ్వే కావాలయ్యా...' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.