RC 16: చరణ్ వర్సెస్ మున్నా భయ్యా.. మీర్జాపూర్
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:41 AM
రామ్ చరణ్-బుచ్చి బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న RC16 సినిమాకు మరో పవర్ ఫుల్ యాక్టర్ యాడ్ అయ్యారు. ఈ యాక్టర్ రాకతో తెలుగు ఫ్యాన్సే కాదు హిందీ, తమిళ్, కన్నడ ఇలా అన్ని ఇండస్ట్రీల ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ పవర్‌ఫుల్ యాక్టర్ ఎవరంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం.. ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ ఆడిషన్ యాడ్ కావడంతో ఫ్యాన్స్ ఉబ్బి తబ్బి పోతున్నారు.
'మీర్జాపూర్' వెబ్ సిరీస్ తో ఇండియన్ వైడ్‌గా క్రేజి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన నటుడు దివ్యేందు శర్మ అలియాస్ మున్నా భాయ్. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వాట్సాప్, ఇన్స్టాలలో మున్నా భయ్యా స్టేటస్ పెట్టుకొని కుర్రాళ్లు ఉండరు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డెబ్యూ చేయనున్నారు. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'RC 16'తో. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మీర్జాపూర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. మున్నా భయ్యా నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడా లేదా ఇంకేదైనా కీ రోల్ లో కనిపిస్తారా అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో ప్రారంభమైంది. చరణ్ ఈ నెలాఖరు నుంచి కెమెరా ముందుకెళ్లే అవకాశాలున్నాయి. జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం కానుంది.. మట్టి లాంటి చిత్రమిదని ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని చరణ్ ఇప్పటికే చెప్పారు.