Pushpa 2 The Rule: పుష్పరాజ్‌.. ఇక నూరు రోజులే ఉండాది

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:36 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2 :ది రూల్‌’. ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ మొదలైంది.

pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2 :ది రూల్‌’ (Pushpa 2: The Rule). ఇప్ప‌టికే షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే ఈ సమూవీ నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. డిసెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్ర‌మంలో నిర్మాత‌లు సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు.

ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ మొదలైంది. సినిమా విడుద‌ల‌కు మరో 100 రోజులు మాత్ర‌మే ఉంద‌నే అంశాన్ని తెలుపుతూ.. ఒక పోస్టర్‌ షేర్‌ చేసింది. ‘మరో వంద రోజుల్లో అతడి రూల్‌ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’ అని టీమ్ పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ‘పుష్ప2 :ది రూల్‌’ (Pushpa 2: The Rule)ను సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేలా చూస్తున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోండ‌గా రష్మిక (Rashmika Mandanna) కథానాయికగా న‌టిస్తుండ‌గా ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్ర‌థ‌మ భాగంను మించి ‘పుష్ప2 :ది రూల్‌’ (Pushpa 2: The Rule) ఉంటుంద‌ని ద‌ర్కుడు సుమార్ ఇప్ప‌టికే ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌క‌టించడంతో చాలామంది ఇప్ప‌టి నుంచే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 09:36 PM