Mokshagna: ఆ వార్తల్లో నిజం లేదు.. మోక్షజ్ఞ ఎంట్రీ
ABN , Publish Date - Dec 18 , 2024 | 09:24 PM
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై గందరగోళం ఏర్పడిన వేళా చిత్ర నిర్మాణ సంస్థలు స్ట్రాంగ్ మెసేజ్‌ని పాస్ చేశారు..
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూని బాలయ్య చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనిఎంచుకున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. మోక్షజ్ఞ కి ఫివర్ వల్లే లేట్ అయ్యిందని బాలయ్య తెలిపిన సినిమా ఆగిపోయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
నిర్మాణ సంస్థలు ట్వీట్ చేస్తూ.. "మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు గురించి ఊహాగానాలు వచ్చాయి. వాటిలో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటనలు, అప్డేట్స్ @SLVCinemasOffl @LegendProdOff) సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీకు తెలియజేస్తాం. అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" అంటూ పేర్కొన్నారు. దీంతో ఫేక్ న్యూస్ కి చెక్ పడింది.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో, వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. నందమూరి అభిమానులను మరియు సాధారణ సినీ ఔత్సాహికులను ఆకర్షించడానికి నటన, ఫైట్లు మరియు నృత్యంలో శిక్షణ సైతం తీసుకున్నాడు. అయితే.. మోక్షజ్ఞ ను కథానాయకుడిగా పరిచయం చేయడానికి బాలకృష్ణ కుటుంబం చాలాకాలంగా సరైన ప్రాజెక్ట్ దర్శకుడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ సామర్థ్యాన్ని గుర్తించి మోక్షజ్ఞ ఎంట్రీకి అతనే సరైన దర్శకుడిగా బాలకృష్ణ భావించి మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.