Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమేనా?

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:53 PM

నందమూరి బాలకృష్ణ (NBK) కుమారుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) హీరో ఎంట్రీ గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ హీరో కావడానికి కావాల్సిన  ఫిజిక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారని, యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమేనా?

నందమూరి బాలకృష్ణ (NBK) కుమారుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) హీరో ఎంట్రీ గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ హీరో కావడానికి కావాల్సిన  ఫిజిక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారని, యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. మంచి కథ, దర్శకుడు కుదిరినప్పుడు తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇస్తాడని బాలయ్య కూడా పలు సందర్భాల్లో చెప్పారు. తొలుత బోయపాటి శ్రీను మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తారని కొందరు, కొత్త దర్శకుడితో వెళ్లారని మరి కొందరు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు.



తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్లిమ్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్‌ చేసి 'వస్తున్నా..  మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైందని నందమూరి అభిమానులు ఆనందిస్తున్నారు. అయితే దీనితో ఎంత నిజం ఉంది.. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేది ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెటిజన్లు దీనిపై సెర్చింగ్‌ మొదలుపెట్టారు. 

Updated Date - Jul 01 , 2024 | 04:53 PM