Mohan Babu: అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా.. అంతే!

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:02 PM

తలైవా రజనీకాంత్‌(Rajinikanth), మోహన్‌బాబు (Mohanbabu)మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.  రజనీకాంత్‌   హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ మోహన్‌బాబుని కలిసి సరదాగా గడుపుతుంటారు.

తలైవా రజనీకాంత్‌(Rajinikanth), మోహన్‌బాబు (Mohanbabu)మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.  రజనీకాంత్‌   హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ మోహన్‌బాబుని కలిసి సరదాగా గడుపుతుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఫొటో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే. ఆ ఫొటోను మోహన్‌బాబు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి  పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది.  రజనీతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను మోహన్‌బాబు పంచుకుంటూ.. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం..’ అనే క్యాప్షన్‌ పెట్టారు.  రజనీకాంత్‌ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం. మోహన్‌బాబు తాజాగా చెన్నైలో జరిగిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌కు హాజరై హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు.

ప్రస్తుతం మోహన్‌బాబు ‘కన్నప్ప’ పనుల్లో బిజీగా ఉండగా.. రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. దీనితో పాటు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 35రోజుల పాటు ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరగనుందట. బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా  ఈ చిత్రం రూపొందుతోంది.

Updated Date - Jul 05 , 2024 | 05:02 PM