Manchu Family Controversy: మోహన్ బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Dec 10 , 2024 | 06:19 PM

అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. ఇంటిలో మాట్లాడుకుని సరిచేసుకోవాల్సిన విషయాన్ని మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు మోహన్ బాబు వాళ్ల ఇంట్లో జరిగింది ఇదే అని చెప్పిన మోహన్ బాబు పని మనిషి.. ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా ఓ వార్త బయటికి వచ్చింది. అంతే.. ఈ ఇష్యూ మరింతగా వార్తలలో హాట్ టాపిక్‌గా మారింది.

Manchu Mohan Babu

ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు. మంచు మనోజ్ ఒకలా, మంచు మోహన్ బాబు మరోలా.. ఇప్పుడు కొత్తగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగడంతో.. టాలీవుడ్ అంతా ఈ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. ఇదిలా ఉంటే, మంచు మోహన్ బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి.. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండటంతో.. తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (Manchu Family Controversy)

Also Read-Big Twist: మోహన్ బాబు ఇంట్లోని పని మనిషి ఏం చెప్పిందంటే..

అసలు మోహన్ బాబు పని మనిషి ఏం చెప్పిందంటే..

మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఇంటిలో పని చేస్తున్న స్టాఫే కారణం అని ఆమె తెలిపింది. మోహన్ బాబు‌పై మంచు మనోజ్ చేయి చేసుకున్నాడని.. తండ్రీ కొడుకులు నెట్టుకున్నా.. ఎవరికీ దెబ్బలు తగలలేదని తెలిపింది. ముఖ్యంగా మంచు మనోజ్‌కు దెబ్బలు తగిలినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఆమె తెలిపింది.


Mohan-Babu-Family.jpg

ఇంకా ఆమె మాట్లాడుతూ... మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు. మోహన్ బాబు మీద చేయిపడితే విష్ణు ఊరుకోడు. అసలు జరిగింది ఏమిటంటే.. శనివారం రాత్రి ప్రసాద్ అనే తన సిబ్బంది ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు. ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్‌ను మనోజ్ దండించబోయారు. అదే సమయంలో నా సిబ్బందిపై చెయ్యి వేయవద్దు, వారికి నేనే భయం చెప్పుకుంటాను.. అంటూ మనోజ్‌ని మోహన్ బాబు తోసేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. అసలు జరిగింది ఇదే. దీనికి వారి మధ్య ఉన్న పాత గొడవలను కూడా యాడ్ చేసుకుని.. విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మొదటి నుండి మోహన్ బాబుకి ఇష్టం లేదు.. అని పనిమనిషి చెప్పుకొచ్చింది.

Also Read-Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 06:25 PM