Mohan Babu: నేనెక్కడికీ పోలేదు.. మా ఇంట్లోనే ఉన్నా

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:14 PM

శుక్రవారం సాయంత్రం నుండి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ రిజిక్ట్ అయిందని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..

Manchu Mohan Babu

మంచు మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని, ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసిందనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం నుండి అజ్ఞాతంలో మోహన్ బాబు అంటూ కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని తాజాగా మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

Also Read-Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతోన్న సినీ ప్రముఖులు

తాజాగా ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు. నేను మా ఇంట్లోనే వైద్య సంరక్షనలో ఉన్నాను. వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయాలని ఈ సందర్భంగా మీడియాను కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై వస్తున్న అజ్ఞాతంలో అనే వార్తలకు బ్రేక్ వేసినట్లయింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉండటంతో డాక్టర్ పర్యవేక్షణలో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు.


ఇటీవల మంచు ఫ్యామిలీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. మరీ ముఖ్యంగా మంగళవారం రాత్రి వారి ఫ్యామిలీలో యుద్ధ వాతావరణం నెలకొంది. వారి గొడవపై రాచకొండ సీపీ మంచు హీరోలైన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆస్తుల కోసమని, ఆత్మగౌరవం కోసమని జరిగిన ఈ గొడవల్లో.. ఫైనల్‌గా వర్కర్స్ కోసం గొడవ జరిగిందనేలా మ్యాటర్ బయటికి వచ్చింది. అయితే మంచు మనోజ్ మాత్రం విషయం వేరే ఉందని, అన్ని బయటపెడతానని చెప్పినప్పటికీ సీపీ ఆదేశాలతో ఆయన మళ్లీ మీడియా ముందుకు రాలేదు.

Also Read-Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 01:10 PM