Big Twist: మోహన్ బాబు ఇంట్లోని పని మనిషి ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:28 PM

రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేంతగా.. వారి మధ్య గొడవలు నడుస్తుండగా.. తాజాగా వారింట్లోని పని మనిషి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందంటే..

Manchu Family Controversy

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏమిటని అడిగితే.. అందరూ చెప్పే మాట మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు. నిజమే ఈ గొడవలకు అంతే లేకుండా పోయింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వారి గొడవలపై వార్తలు వచ్చాయి. ఫస్ట్ ఆస్తుల కోసం గొడవలు అన్నారు, తర్వాత శ్రీ విద్యానికేతన్ కారణమనేలా వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఆత్మగౌరవం కోసం గొడవలు అనేలా మంచు మనోజ్ కామెంట్స్ వింటుంటే అర్థమవుతోంది. ఆత్మగౌరవం కోసమే ఈ పోరాటం అని మంచు మనోజ్ చేసిన కామెంట్స్‌తో అసలీ వివాదం వెనుక పెద్ద కథే ఉందనేది స్పష్టమవుతోంది.

Also Read- Manchu Manoj: నా పోరాటం ఆస్తి కోసం కాదు..


ఇదేనా జరిగింది?

మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తుల వివాదం ఎప్పటి నుండో నడుస్తుండగా.. ఇటీవల వేరే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దానివల్లే‌ మనోజ్, మోహన్ బాబు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మోహన్ బాబుకి చెందిన శంషాబాద్ ఇంట్లో మొదటి నుంచి కొందరు వర్కర్లు ఉన్నారు. ఈ మధ్య మనోజ్ భార్య మౌనిక వైపు నుంచి కొందరు వర్కర్లు చేరారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు సేవలు చేసే సన్నిహితమైన వర్కర్స్‌కు, మనోజ్ కుటుంబానికి సేవలు చేసే వర్కర్స్‌కు మధ్య వివాదం జరిగిందని.. ఈ విషయంలో మోహన్ బాబు వర్కర్స్‌ను మనోజ్ గట్టిగా తిట్టడమే కాకుండా కొట్టినట్లుగా కూడా టాక్ వినబడుతోంది.

Also Read- Mohan Babu: గొడవలు సహజం.. మేం పరిష్కరించుకుంటాం..


దీంతో మోహన్ బాబుకి చెందిన సదరు వర్కర్స్ డ్యూటీకి కొన్ని రోజులు రాలేదని.. మోహన్ బాబు ఆరా తీయగా అసలు విషయం తెలిసిందని.. అక్కడే మనోజ్‌కు, మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యిందనేలా వార్తలు బయటికి వచ్చాయి. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది. నీ వల్లే మనోజ్‌ని ఇంట్లోకి రానిచ్చాను అని మోహన్ బాబు తన భార్యపై కోపం ప్రదర్శించగా.. నా తల్లినే తిడతావా అంటూ తండ్రితో మనోజ్ గొడవ పడినట్లుగా తెలుస్తోంది. ఇలా వర్కర్స్ మధ్య జరిగిన ఇష్యూ కాస్తా.. తండ్రీ తనయుల మధ్య వివాదంగా మారిందని, అది కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందనేది ప్రస్తుతం ఈ ఫ్యామిలీ వివాదంలోని సారాంశం.


Manchu.jpg

అయితే మోహన్ బాబుకు చెందిన పని మనిషి ఏం చెప్పిందంటే..

స్టాఫ్ వల్లే గొడవ జరిగింది. మోహన్ బాబు‌పై మంచు మనోజ్ చేయి చేసుకున్నాడు. తండ్రీ కొడుకులు నెట్టుకున్నారు. మనోజ్‌కు దెబ్బలు తగల్లేదు. మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు. మోహన్ బాబు మీద చేయిపడితే విష్ణు ఊరుకోడు. అసలు జరిగింది ఏమిటంటే.. శనివారం రాత్రి ప్రసాద్ అనే తన సిబ్బంది ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు. ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్‌ను మనోజ్ దండించబోయారు. అదే సమయంలో నా సిబ్బందిపై చెయ్యి వేయవద్దు, వారికి నేనే భయం చెప్పుకుంటాను.. అంటూ మనోజ్‌ని మోహన్ బాబు తోసేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. అసలు జరిగింది ఇదే. దీనికి వారి మధ్య ఉన్న పాత గొడవలను కూడా యాడ్ చేసుకుని.. విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మొదటి నుండి మోహన్ బాబుకి ఇష్టం లేదు.. అని పనిమనిషి చెప్పుకొచ్చింది.

Also Read- Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్


Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 05:54 PM