Mohan Babu - Kannappa: ప్రభాస్‌తో చేద్దామనుకున్న సినిమా ఇది!
ABN , Publish Date - Jun 14 , 2024 | 06:47 PM
"కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్ తో ఈ సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే! స్క్రిప్ట్ కూడా సిద్థం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న ఆ కథ నాకు ఇచ్చారు
"కృష్ణంరాజు (Krishnam Raju) నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ (Kannappa) 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్ తో ఈ సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే! స్క్రిప్ట్ కూడా సిద్థం చేసుకున్నారు. నేను విష్ణుతో (manchu Vishnu) తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న ఆ కథ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది’’ అని మోహన్ బాబు (Mohan babu) అన్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ ‘కన్నప్ప’. ఇందులో విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టీజర్ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీజర్ రిలీజ్ చేశారు.
మోహన్ బాబు మాట్లాడుతూ '‘ఇది ప్రజల సినిమా. ఏ తరం వారికైరా కొత్తగా అనిపించే చిత్రమిది. భక్తి, భావం, ఆ భక్తి ఎలా వస్తుంది. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏంటి? వంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఒక సినిమా నిర్మించాలంటే దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎన్నో వ్యయప్రయాసలకు కోర్చి ఈ సినిమా తీశాం. భారతదేశం నలుమూలల ఉన్న ఆర్టిస్ట్‌లు ఈ చిత్రంలో నటించారు. వారంతా ఆ పాత్రలకు ఎంతగా న్యాయం చేశారనేది తెరపైనే చూడాలి. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా చేశారు. శరత్‌కుమార్ నాకు సోదరుడితో సమానం. ఏ పాత్రనైనా అలవోకగా చేస్తారు. ఇది భక్తి చిత్రమే కాదు.. అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని పెద్దలు చెబుతుంటారు. ఆయన ఆశీస్సులతోనే కన్నప్ప తీశాం’’ అని అన్నారు.
శివుడు అనుమతి ఇచ్చాడు: మంచు విష్ణు
మంచు విష్ణు మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్ చేయాలని 2014లోనే అనుకున్నాను. దీని లొకేషన్స్ కోసం నాలుగు సంవత్సరాలుగా ఎన్నో దేశాలు తిరిగాను. రీసెర్చ్ చేశాను. ఇది నిజంగా జరిగిన కథ. నా కలల ప్రాజెక్ట్. నా బిడ్డతో సమానం. ‘2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్నగారు పిలిచి.. డైరెక్టర్‌ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏంటి? అని అడిగారు. పరమేశ్వరుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి సిద్ధంగా ఉండాలనే హోమ్ వర్క్ అంతా చేస్తున్నాను నాన్న అన్నాను. గతేడాది జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఇది మీ ముందుకు తీసుకురావడానికి శివుడు ఆశీస్సులే కారణం’ అని మంచు విష్ణు అన్నారు.
'కన్నప్ప' కృష్ణంరాజుకు చాలా ఇష్టమైన కథ. ప్రభాస్ కోసం ఆయన ఈ కథను సిద్థం చేశారు. ఆ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా?
మోహన్ బాబు : కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ఆయన ప్ఘ్రభాస్‌తో ఈ సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే! స్ర్కిప్ట్ కూడా సిద్థం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న స్ర్కిప్ట్ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు.
కన్నప్పలో మీ పాత్ర గురించి ఏమైనా హింట్ ఇస్తారా?
విష్ణు: వచ్చే నెల నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తుంది. అప్పుడే అందరి గురించి వెల్లడిస్తాం. ప్రభాస్‌కు ఇందులోని అందరితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇంతమంది ఆర్టిస్ట్‌లు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. సినిమా చూశాక ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. శివుడికి కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేశాను. ఒక నటుడిగా ఈ సినిమా నాకు గౌరవాన్ని పెంచుతుంది. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాల్‌గా అనిపించింది. శరత్‌కుమార్ గారితో చేేసటప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కన్నప్ప కెరీర్‌పరంగా నా జీవితాన్ని మార్చేస్తుంది.
ప్రభాస్ గురించి ఒక్కమాటలో చెప్పండి?
విష్ణు: రక్తసంబంధం కాకపోయినా.. ప్రభాస్ నాకు తమ్ముడితో సమానం.
దర్శకుడిగా ముకేశ్ కుమార్‌సింగ్‌ని ఎంచుకోడానికి కారణం?
విష్ణు: ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పడుతుంది. అంత సమయం కేటాయించడానికి ఎవరు అంగీకరిస్తారు అని అనుకున్నాం. అప్పుడు నాన్నగారు ముకేశ్ గురించి చెప్పారు. మహా భారతం సీరియల్‌ను అద్భుతంగా తీశారు. ఆయన్ని సంప్రదించు అన్నారు. అడగ్గానే అంగీకరించారు. ‘మహాభారతం సినిమాగా తీస్తే కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల్లో నటిస్తాను.