Vettaiyan: వెట్ట‌యాన్‌పై ట్రోలింగ్‌.. మ‌రి ఇంత‌గా తెగించారేంట్రా

ABN , Publish Date - Oct 09 , 2024 | 09:17 PM

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ దారి త‌ప్పుతుంది. తాజాగా ఈ లిస్టులోకి ర‌జ‌నీకాంత్ వెట్ట‌యాన్ సినిమా చేరింది. తెల్లారితే విడుద‌ల కావాల్సిన ఈ మూవీపై సోష‌ల్ మీడియాలో ఎన్న‌డూ చూడ‌ని, ఊహించ‌ని ట్రోలింగ్ జ‌రుగుతోంది.

సోష‌ల్ మీడియాలో ఏ నిమిషాన ఏది ట్రెండింగ్‌లోకి వ‌స్తుందో, ఎందుకు వ‌స్తుందో అనేది అంతుబ‌ట్ట‌కుండా త‌యారైంది. అది పాజిటివ్ అంశం అయితే ఇబ్బంది లేదు కానీ అదో విమ‌ర్శ అవ‌త‌లి వారిపై ట్రోలింగ్ అంటే ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. అవ‌త‌లి వారు త‌మ దుకాణం మూసేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ముఖ్యంగా సినిమాలు, సెల‌బ్రిటీల విష‌యంలో ఈ ట‌ట్రోలింగ్ అంత‌కుమించి అనేలా ఉంటుంది. తాజాగా ఈ లిస్టులోకి ర‌జ‌నీకాంత్ (Rajinikanth) వెట్ట‌యాన్ (Vettaiyan) సినిమా చేరింది. తెల్లారితే విడుద‌ల కావాల్సిన ఈ మూవీపై సోష‌ల్ మీడియాలో ఎన్న‌డూ చూడ‌ని, ఊహించ‌ని ట్రోలింగ్ జ‌రుగుతోంది. వెట్ట‌యాన్ డిజాస్ట‌ర్‌, బాయ్ కాట్ వెట్ట‌యాన్ అనే యాష్ ట్యాగ్‌లు ఎక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బ‌చ్చ‌న్‌, రానా, హాద్ ఫాజిల్ వంటి భారీ తారాగ‌ణంతో జై భీం సినిమా ద‌ర్శ‌కుడు జ్ఞ‌న్‌వేల్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు ( ఆక్టోబ‌ర్ 10) న ప్పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా వెట్ట‌యాన్ అనే పేరును మార్చ‌కుండా అలానే అన్ని భాష‌ల‌లో విడుద‌ల చేస్తున్న క్ర‌మంలో తమిళ్ పేరు ఉండడం ఏమిటంటూ అయా ఇండ‌స్ట్రీల నుంచి తీవ్ర వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సోషల్ మీడియాలో పెద్ద వ్య‌వ‌హార‌మే న‌డుస్తోంది. వీరికి యాంటి ర‌జ‌నీ ఫ్యాన్స్ కూడా తొడ‌వ‌డంతో ఈ ట్రోలింగ్ శృతిమించింది. అఖ‌రుకు ర‌జ‌నీ ఫొటోకు బొట్టు పెట్టి పిండాలు పెట్టేస్తున్నారంటే వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళ్లిందో అర్ధ‌మ‌వుతుంది. ముఖ్యంగా త‌మ‌ళ‌నాటే ఈ ట్రోలింగ్ అధికంగా జ‌ర‌గ‌డం విచారించాల్సిన ప‌రిణామం.


ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్న సురేష్ బాబు (Suresh Babu), దిల్ రాజు (Dil Raju), రానా దగ్గుబాటి రామానాయుడు (Rana Daggubati) స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా సినిమాపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించి మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. సినిమా టైటిల్ తెలుగులో లేక‌పోవ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

GZc9ChmbsAA9-rQ.jpeg

అదే స‌మ‌యంలో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లెట‌ర్ రిలీజ్ చేసి సినిమా టైటిల్ విష‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను వివ‌రించారు. మూవీకి వేట‌గాడు టైటిల్ పెట్టాల‌నుకున్న‌ప్ప‌టికీ అప్ప‌టికే ఆ పేరు వేరే వాళ్లు రిజిస్ట‌ర్ చేసుకుని ఉన్నార‌ని అందుకే వెట్ట‌యాన్ ది హంట‌ర్‌గా మార్చి అన్ని డ‌బ్బింగ్ వెర్స‌న్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. తెలుగు వాళ్లంతా స‌హృద‌యంతో సినిమాను ఆద‌రించాల‌ని కోరారు. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాపై జ‌రుగుత‌న్న ట్రోలింగ్ క‌లెక్ష‌న్ల‌పై ఏ మేర‌కు ప్ర‌భావం చేస్తుందో వేచి చూడాలి.


Updated Date - Oct 09 , 2024 | 09:22 PM