Ram Charan: రామ్‌చరణ్‌తో ఫొటో.. కల నెరవేరిందన్న మెల్‌బోర్న్‌ మేయర్‌!

ABN , Publish Date - Aug 20 , 2024 | 10:40 AM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) మెల్‌బోర్న్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే! ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’కు (IFFM 2024)గౌరవ అతిథిగా హాజరైన ఆయన అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీ దిగారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) మెల్‌బోర్న్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే! ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’కు (IFFM 2024)గౌరవ అతిథిగా హాజరైన ఆయన అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీ దిగారు. తాజాగా దీనిపై మెల్‌బోర్న్‌ (Melbourne Mayor) మేయర్‌ నిక్‌ రీస్‌ (Nick reece melbourne) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తాను కూడా రామ్‌ చరణ్‌కు పెద్ద ఫ్యాన అని తెలిపారు.


‘ ఆస్ట్రేలియా నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న ఇండియన్స్  పెద్ద పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి రోషెనాతో కలిసి నేను తాజాగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్లాను. రామ్‌ చరణ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నా. చాలా కాలంగా ఉన్న నా కోరిక తీరింది. నాకున్న విష్‌ లిస్ట్‌లలో ఒకటి నెరవేరింది’ అంటూ చరణ్‌పై తనకున్న అభిమానాన్ని తెలిపారు నిక్‌ రీస్‌. ‘అక్టోబర్‌లో డిప్యూటీ మేయర్‌గా రోషెనా ఎన్నికేౖతే ఆమె చరిత్ర సృష్టిస్తారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్థానాన్ని పొందిన భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి ఆమె అవుతారు. ఆమెతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని నిక్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Nick-reece.jpg

‘అందుకే చరణ్‌ను గ్లోబల్‌ స్టార్‌ (global star Ram charan)అంటారు’ అని ఒక అభిమాని కామెంట్‌ చేయగా.. ‘త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ విడుదలవుతుంది. తప్పక చూడండి’ అని మరో నెటిజన్ కోరారు. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోన్న ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’ 15వ ఎడిషన్‌కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు. ఆరేస్టలియాలో మన జాతీయ జెండాను ఎగురవేశారు. అక్కడ షూటింగ్‌ చేసిన ‘ఆరెంజ్‌’ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

Melborne.jpg

Updated Date - Aug 20 , 2024 | 10:43 AM