Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

ABN , Publish Date - Oct 12 , 2024 | 11:02 AM

మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రేక్షకులందరినీ మెప్పించింది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఎలా ఉందొ మీరు చూసేయండి.

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడాలేని బజ్ సినిమాపై ఏర్పడింది. రీసెంట్‌గా మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్‌గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రేక్షకులందరినీ మెప్పించింది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఎలా ఉందొ మీరు చూసేయండి.

Updated Date - Oct 12 , 2024 | 11:18 AM