Chiranjeevi: నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఏ పార్టీలో లేను! చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ABN , Publish Date - May 10 , 2024 | 01:51 PM

నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఏ పార్టీలో లేను అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆన్నారు. నిన్న పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ఆయ‌న శుక్ర‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాలిటిక్స్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Chiranjeevi: నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఏ పార్టీలో లేను! చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
chiranjeevi

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ముర్ము ప్రదానం చేయగా.. మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.

chiranjeevi.jpeg

అవార్డు అదుకున్న అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి తిరిగి శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌కు చేరున్న ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. 45 సంవ‌త్స‌రాల‌ సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డ్ ఇచ్చిందని.. నా ఈ ఉన్నతికి కార‌ణ‌మైన అభిమానులు, ప్రేక్షకులు ,దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. ఏ టైమ్‌కు ఏది రావాలని ఉంటే అది వస్తుంద‌ని, నేను దేని కోసం ఎదురు చూడలేద‌న్నారు.


స్వ‌ర్గీయ ఎన్టీఆర్ గారికి భారత రత్న అవార్డ్ రావాలని కోరుకుంటున్నా అని అ అవార్డు వారికి ఇవ్వటం సముచితమ‌ని, ఎంజీఆర్‌కు వచ్చినపుడు, ఎన్టీఆర్ గారికి రావాలని అన్నారు. ఇక ప్ర‌స్తుతం నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని, ఏ పార్టీలో లేనని స్ప‌ష్టం చేశారు. పవన్‌తో నేను ఉన్నానని చెప్పేందుకు ఆ వీడియో చేశాన‌న్నారు. నేను పిఠాపురం వెళ్లటం లేదని మా‌ కుటుంబ సపోర్ట్ తనకి ఎప్పుడు ఉంటుందన్నారు. కళ్యాణ్ బాబు కూడా నన్ను రావాలని కోరుకోలేదన్నారు.

Updated Date - May 10 , 2024 | 02:07 PM