Chiranjeevi: ఈ మధ్య ఇంతలా నవ్వించిన సినిమా రాలేదు.. ఎండ్ టైటిల్స్ కూడా చూసా

ABN , Publish Date - Sep 15 , 2024 | 10:56 AM

ఈ మధ్య ఇంతలా నవ్వించిన సినిమా రాలేదు.. ఎండ్ టైటిల్స్ కూడా మిస్స‌వ‌కుండా చూసానంటూ మెగ‌స్టార్ చిరంజీవి మ‌త్తు వ‌ద‌ల‌రా 2 సినిమాను చూసి ఓ రేంజ్‌లో ఆకాశానికెత్తేశారు.

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) త‌ను చూసిన సినిమా గురించి గానీ, మంచి సందేశాత్మ‌క చిత్రాలు వ‌చ్చిన‌ప్పుడు గానీ ఆ సినిమాల‌ను, అందులోని న‌టీన‌టుల‌ను ఇంటికి పిలిపింఉచుకుని మ‌రీ అభినందిస్తారు. కొన్ని సార్లు ఆయా సినిమాల గురించి త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెడుతుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా చిరంజీవి మ‌త్తు వ‌ద‌ల‌రా 2 (MathuVadalara2 ) సినిమాను చూసి ఓ రేంజ్‌లో ఆకాశానికెత్తేశారు. ఆయ‌న త‌న పోస్టులో ఏం రాసుకొచ్చారంటే..

నిన్ననే 'మత్తు వదలరా - 2' (MathuVadalara2 ) చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. Hats off అంటూ త‌న అనందాన్ని పంచుకున్నారు.

GXaFRu3acAARQSE.jpeg

ఈ నేప‌థ్యంలో చిత్రంలోని ప్ర‌ధాన టెక్నీషియ‌న్స్ ద‌ర్శ‌కుడు రితేశ్ రాణా (Ritesh Rana), హీరో శ్రీ సింహా (Sri Simha), క‌మెడియ‌న్ స‌త్య (Satya), హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) సంగీత ద‌ర్శ‌కుడు కాళ భైర‌వ (Kaala Bhairava), మైత్రీ మూవీ మేక‌ర్స్‌(Mythri Movie Makers)ల‌కు పేరుపేరున అభినంద‌న‌లు తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 10:56 AM