Pushpa 2: పుష్పకి మెగా సపోర్ట్.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ

ABN , Publish Date - Dec 04 , 2024 | 08:24 PM

ఎట్టకేలకు పుష్పరాజ్‌కి మెగా సపోర్ట్ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో పుష్ప మేనియాకి సమాంతరంగా మెగా వర్సెస్ అల్లు రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు పుష్ప మేనియా నడుస్తున్న సమయంలో మెగా హీరోల మౌనం 'పుష్ప 2' మైనస్ గానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే రిలీజ్ కొన్ని గంటల ముందు ఎట్టకేలకు మెగా హీరోలు ఒక్కొక్కరిగా మౌనం వీడుతున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..


మొదటగా మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ డైరెక్ట్ గా బన్నీకి మద్దతు తెలపగా, మెగా బ్రదర్ పరోక్షంగా మద్దతు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. " 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను" అంటూ ఆయన రాసుకొచ్చారు. దీంతో పరోక్షంగా ఆయన మెగాభిమానులను 'పుష్ప 2' సినిమాని ఎంకరేజ్ చేయమని కోరారు. ఆయన డైరెక్ట్‌గా పుష్ప సినిమాని, అల్లు అర్జున్‌ని గాని మెన్షన్ చేయలేకపోయారు.


అంతకు ముందు సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేస్తూ.. పుష్ప టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే 'సెండింగ్ మై హార్ట్‌ఫెల్ట్ విషెస్ టూ' అంటూ అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, రసూల్ పూకుట్టి, మైత్రీ, సుకుమార్ నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ తేజు.. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తునని రిప్లై ఇచ్చారు. దీంతో మెగా, అల్లు మ్యూచ్‌వల్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

Updated Date - Dec 04 , 2024 | 08:24 PM