Meenakshi chaudhary: మీనాక్షి చౌదరి మరో అవకాశం కొట్టేసిందా?
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:46 PM
తండేల్’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తరవాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ ఎవరంటే...
‘తండేల్’ (Thandel) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తరవాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు (karthik Varma Dandu) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు చిత్ర వర్గాల నుంచి సమాచారం. చైతూ (Naga Chaitanya) పక్కన నటించడం మీనాక్షికి(Meenakshi Choudhary) ఇదే మొదటిసారి.. ఈ కాంబో ఫ్రెష్ గా ఉంటుందని చిత్రబృందం అనుకుంటోందట. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టు ఫిక్సయింది.
మీనాక్షి చౌదరి ఈ ఏడాదంతా బిజీ బిజీగా గడుపుతోంది. సంక్రాంతికి ఆమె నటించిన ‘గుంటూరు కారం’ విడుదలైంది. మహేశ్‌కు మరదలుగా కనపించింది. ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’తో సూపర్‌హిట్ అందుకుంది. మొన్నే మట్కా విడుదలైంది. ఈ వారంవిడుదల కానున్న మెకానిక్ రాకీలో కూడా ఆమె కథానాయికగా నటించింది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ కథానాయిక గా మారింది మీనాక్షి. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇప్పుడు చైతూ సినిమా కూడా యాడ్ అయింది.