Avantika Vandanapu: నిన్న అలా.. నేడు ఇలా! అవంతిక‌లో విష‌యం చాలానే ఉందిగా

ABN , Publish Date - Jan 18 , 2024 | 06:59 PM

ఇటీవ‌లే పూర్తి మేకోవ‌ర్ లుక్‌తో రెండు తెలుగు రాష్ట్రాల యూత్‌ను షాక్‌కు గురి చేసిన బాల న‌టి అవంతిక వంద‌న‌పు గురించి ఇప్ప‌టికే చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కు సంబంధించిన మ‌రో విష‌యం బ‌య‌ట‌కు రాగా నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్న‌ది.

Avantika Vandanapu: నిన్న అలా.. నేడు ఇలా! అవంతిక‌లో విష‌యం చాలానే ఉందిగా
avanthika vandanapu

ఇటీవ‌లే పూర్తి మేకోవ‌ర్ లుక్‌తో రెండు తెలుగు రాష్ట్రాల యూత్‌ను షాక్‌కు గురి చేసిన బాల న‌టి అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu) గురించి ఇప్ప‌టికే చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కు సంబంధించిన మ‌రో విష‌యం బ‌య‌ట‌కు రాగా నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్న‌ది. తెలుగులో కెరీర్ మొద‌లు పెట్టి ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ యువ న‌టి ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తూ క‌స్ట‌మ‌ర్స్‌కు ఫుడ్ అంద‌జేసే వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియో చూసిన వారు చాలామంది అవంతిక‌ను మెచ్చుకుంటుండ‌గా ఇంత మంచి గుర్తింపు ఉన్నా ఇంకా రెస్టారెంట్‌లో పని చేయ‌డంపై ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

2016లో వ‌చ్చిన మ‌హేశ్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో బాల న‌టిగా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu) ఆ త‌ర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్, అజ్ఞాతవాసి, రారండోయ్ వేడుక చూద్దాం వంటి తెలుగు సినిమాల‌తో పాటు భూమిక అనే త‌మిళ సినిమాలో న‌టించి మెప్పించింది. ఆ త‌ర్వాత అమెరికాలో ఉంటున్న త‌ల్లిదండ్రుల వ‌ద్దకు వెళ్లి అక్క‌డే ఉండిపోయి డిస్నీ సంస్థ నిర్మించిన‌ సిరీస్‌, సినిమాల‌లో న‌టించింది. తాజాగా అవంతిక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతుంది.


ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మ‌డు చాలా బోల్డ్‌గా క‌నిపించడంతో పాటు ఓ పాట‌లో శృతిమించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో అ పాట‌ను చూసిన వారు, అవంతిక గురించి తెలిసిన వారు నోరెళ్ల బెట్టారు. మ‌నం చూస్తున్న‌ది అప్పుడు తెలుగు సినిమాల‌లో చూసిన అమ్మాయేనా, ఇంత‌లో అంత మ‌ర్పా అంటూ షాక్ అయ్యారు. అంతేగాక‌ ఉన్న‌ఫ‌లంగా షోష‌ల్ మీడియాలో అవంతిక (Avantika Vandanapu)ను ఫాలో అయ్యే వారి సంఖ్య రెట్టింపు అయింది. ఈ ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) సినిమా మ‌న ఇండియాలో ఇంకా విడుద‌ల కాన‌ప్ప‌టికీ ఆ సినిమా గురించి వెతికే వారి సంఖ్య కూడా పెరిగింది.

ఈ ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) సినిమా అనంత‌రం హోరోస్కోప్, క్రౌన్ విషెష్ అనే రెండు చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న అవంతిక ఓ రెస్టారెంట్‌లో వ‌ర్క్ చేస్తు క‌స్ట‌మ‌ర్‌కు ఫుడ్ స‌ప్లై చేయ‌డం ఇప్పుడు అక్క‌డ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అవంతిక (Avantika Vandanapu) సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో స‌ద‌రు రెస్టారెంట్ అవంతికకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. ఇదిలాఉండ‌గా అవంతిక రెస్టారెంట్‌లో ఇంకా ప‌ని చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

అయితే అమెరికాలో ఓ సాంప్ర‌దాయం ఉంది. ఫ్యామిలీ ఎంత ధ‌న‌వంతులైన‌ప్ప‌టికీ త‌మ పిల్ల‌ల‌ను యుక్త వ‌య‌స్సు వ‌చ్చాక‌ అంటే 16 నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నిండితే వారు స్వ‌యంకృషితో స్వంతంగా ఏదైనా ప‌ని చేసుకుని బ‌త‌కాల‌నే రూల్ ఉంది. ఈ క్ర‌మంలోనే అవంతిక (Avantika Vandanapu) త‌ల్లిదండ్రులు ఉన్న‌వాళ్లైన‌ప్ప‌టికీ త‌ను ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తు మ‌రో వైపు సినిమాల‌లో న‌టిస్తూ చాలామంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ది,

Updated Date - Jan 18 , 2024 | 07:19 PM