Pushpa 2 The Rule: ‘పుష్ప 2’కు మాసివ్ ఈవెంట్స్
ABN , Publish Date - Nov 09 , 2024 | 09:08 PM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. ‘పుష్ప’ మొదటి పార్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టడంతో.. ఈ పార్ట్ 2 పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్‌ని నిర్వహించబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మాసివ్ అప్డేట్ని మేకర్స్ వదిలారు.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ టీజర్.. ఆ షాట్ అదిరింది
ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుండగా.. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్‌ను మేకర్స్ మాసివ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ సీటీస్ ఏవంటే..
‘పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్’ లలో ఈ మాసివ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే శ్రీలీలతో ఐటం సాంగ్ షూట్ జరుగుతున్నట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 5న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసేందుకు సర్వాంగ సుందరంగా ఈ సినిమాను ముస్తాబు చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.