Maruthi: సింపుల్‌ లాజిక్‌.. ఆయనంటే  ఎంత ఇష్టమో చూస్తారు!

ABN , Publish Date - Feb 04 , 2024 | 06:22 PM

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌ను అభిమానులను అలరించింది. ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు దర్శకుడు మారుతి అప్‌డేట్‌ ఇస్తున్నారు.

Maruthi: సింపుల్‌ లాజిక్‌.. ఆయనంటే  ఎంత ఇష్టమో చూస్తారు!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’ (The Raja Saab). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌ను అభిమానులను అలరించింది. ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు దర్శకుడు మారుతి అప్‌డేట్‌ ఇస్తున్నారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు అన్ని వేళలా సమాధానం ఇస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా ‘ట్రూ లవర్‌’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మారుతి.. ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ "నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌ని. ప్రస్తుతం ఆయన ప్రేమని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఆయనంటే నాకెంత ఇష్టమో ‘రాజా సాబ్‌’లో చూస్తారు.  చాలా సింపుల్‌ లాజిక్‌  ఇది’ అన్నారు. 

 మరో ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా విడుదల తేదీపై స్పందించారు. ‘త్వరలోనే ప్రభాస్‌ నటించిన పెద్ద సినిమా విడుదల కానుంది. దాని అప్‌డేట్స్‌ రావాలి. ఆ చిత్రం మంచి విజయం సాధించాలి. దాని తర్వాత ‘రాజాసాబ్‌’ అప్‌డేట్స్‌ వస్తాయి. అందరూ కోరుకునే మంచి తేదీకే దీన్ని రిలీజ్‌ చేస్తాం’ అన్నారు. ప్రస్తుతం అభిమానులు ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్‌ను షేర్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నారని టాక్‌. ఈ చిత్రంతోపాటు ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్నఈ చిత్రం మే 9న విడుదల కానుంది. 


Updated Date - Feb 04 , 2024 | 06:22 PM