ManojManchu: మంచు వారింట వేడుక‌.. మ‌నోజ్, మౌనిక‌ల కూతురికి నామ‌క‌ర‌ణం

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:00 PM

ఇటీవ‌ల మంచు మ‌నోజ్ , మౌనిక దంప‌తులు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా వారు త‌మ‌ బిడ్డ‌కు నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వం నిర్వ‌హించారు.

Manoj Manchu

ఇటీవ‌ల మంచు మ‌నోజ్ (Manchu Manoj), మౌనిక (Mounika) దంప‌తులు త‌ల్లిదండ్రులుగా గ‌త ఏప్రిల్‌లో ప్ర‌మోష‌న్ పొందిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 13న మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మంచు వారి ఇంట ఓ వేడుక జ‌రిగింది. త‌మ‌ బిడ్డ‌కు నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వం నిర్వ‌హించారు.

GR8x76OWoAAED4W.jpeg


ఈ సంద‌ర్భంగా తన అత్తగారు దివంగ‌త నేత‌ శోభ నాగిరెడ్డి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు వ‌చ్చేలా .దేవసేన శోభ ఎంఎం (Devasena Shobha MM) పేరు పెట్టిన‌ట్లు మనోజ్ తెలిపాడు. మీ ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ మా ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశాడు.

GR8x76TW8AArbri.jpeg

ఈ వేడుక‌కు మంచు మోహ‌న్‌బాబు Manchu దంప‌తులు, మౌనిక త‌రుపు కుటుంబ స‌భ్యులు హ‌జ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను మ‌నోజ్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి.

GR8x76LW0AAXMWG.jpeg

Updated Date - Jul 08 , 2024 | 03:00 PM