Manchu Vishnu: ఫైనల్‌గా విష్ణు కుటుంబం అక్కడే స్థిరపడుతుందా...
ABN , Publish Date - Dec 10 , 2024 | 09:47 AM
నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు దుబాయ్‌లో ఉంటున్నారా? భవిష్యత్తులో అక్కడే స్థిరపడే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే చెబుతున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.
నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA President) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) దుబాయ్‌లో ఉంటున్నారా? భవిష్యత్తులో అక్కడే స్థిరపడే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే చెబుతున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కొంతకాలంగా విష్ణు భార్య వెరానిక, నలుగురు పిల్లలు దుబాయ్‌లోనే ఉంటున్నారు. విష్ణు మాత్రం అప్పుడప్పుడు దుబాయ్ వెళ్లొస్తుంటారు. భవిష్యత్తులో ఆయన అక్కడే స్థిరపడతారని టాక్ నడుస్తోంది. అమెరికా నుంచి వస్తున్న ఆయన దుబాయ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో తన కుటుంబాన్ని కలిశారు. ఆ ఫొటోలను విష్ణు భార్య ఇన్‌స్టాలో షేర్ చేసి 'ఎప్పుడు విష్ణు సర్‌ప్రైజ్ ఇస్తాడు.. ఈసారి నేను సర్‌ప్రైజ్ చేశా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. (Manchu Family war)
సోమవారం రాత్రి మంచు మనోజ్ పోస్ట్ చేసిన లేఖలో ''నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాల రీత్యా దుబాయికి వెళ్లాడు'’ అని పేర్కొనడంతో ఆయన దుబాయ్‌కి రూట్ వేసుకోవడం నిజమే అని తెలుస్తోంది. దుబాయ్‌లో కుటుంబ పోషణ అంటే మామూలు విషయం కాదు. పెద్ద లెక్కతో కూడినదే. విద్యా సంస్థల నుంచి వచ్చే ఆదాయంతోనే మంచు విష్ణు దుబాయ్‌లో స్థిరపడే ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఆ ఉద్దేశంతోనే 'మంచు విష్ణు కుటుంబ ఆస్తులను తన వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుంటున్నాడని, ఇంకా కుటుంబం నుంచి మద్దుతు పొందుతూనే ఉన్నాడని, నా తండ్రి తనను పక్కకు తప్పించి.. విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడంటూ మనోజ్ కామెంట్ చేశాడు. ఫ్యామిలీ ప్రాపర్టీని విష్ణు దుర్వినియోగం చేశాడని, స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడని ’’ అని మనోజ్ కామెంట్ చేశారు. ఇదంతా చూస్తే విష్ణు తన స్వలాభం కోసం తండ్రి ఆస్తిని ఉపయోగించుకుంటున్నాడనే ఉద్దేశంతోనే మనోజ్ ఈ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మంచు విష్ణుకి వ్యక్తిగతంగా హైద్రాబాద్‌లో స్కూల్స్ ఉన్నాయి. వాటి మేనేజ్‌మెంట్ చూసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నటుడిగా 'కన్నప్ప’ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన మా అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండో దఫా కొనసాగుతున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం విష్ణు దుబాయ్‌కి మకాం మార్చారు. మరి ఆయన అటు దారి వేసుకుంటే 'మా’ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలు ఎలా నెరవేరతాయి, మా బిల్డింగ్ పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.